Skip to main content

Posts

Showing posts with the label prapatti

Shree Venkateshwara Prapatti in Telugu

Shree Venkateshwara Prapatti in Telugu శ్రీ వేంకటేశ ప్రపత్తిః ఈశానం జగతోస్య వేంకటపతే ర్విష్ణోః పరాం ప్రేయసీమ్ తద్వక్షస్థ్సల నిత్యవాసర సికాం తత్‌ క్షాంతి సంవర్థనీమ్‌ పద్మాలంకృత పాణిపల్లవ యుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్జ్వలాం భగవతీం వందే జగన్మాతరమ్‌. ॥ 1 ॥ తా. ఈ లోకములకు ఆధారమైనదియు, శ్రీ వేంకటేశ్వరునికి మిక్కిలి ఇష్టురాలును, అతని వక్షస్థలమందు నిత్యము నివసించుటచే ఆనందించునదియును, అతని యోరిమిని వృద్ధి చేయునదియును, రెండు హస్తములందును కమలములను ధరించునదియును పద్మాసనమున ఉండునదియును, వాత్సల్యము మున్నగు గుణములచే ప్రకాశించునదియు, భగవతియు, లోకములకు తల్లియు అగు లక్ష్మీదేవికి నమస్కార మొనర్తును. శ్రీమన్‌ కృపాజలనిధే కృతసర్వలోక సర్వజ్ఞ శక్త నతవత్సల సర్వశేషిన్‌ స్వామిన్‌ సుశీల సులభాశ్రిత పారిజాత శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ॥ 2 ॥ తా. శ్రీమంతుడవగు వేంకటేశ్వరా! నీవు దయాసముద్రుడవు. సమస్త లోకములకు సృష్టికర్తవు. సర్వజ్ఞుడవు. సర్వశక్తుడవు. సేవించువారి యెడల వాత్సల్యము కలవాడవు. సర్వస్వతంత్రుడవు. ప్రభువైనవాడవు. సుగుణములు కలవాడవు. ఆశ్రితులకు సులభముగా లభించు కల్పవృక్షమవు. నీ పాదములనే ...